Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈరోజు కూడా భక్తుల సంఖ్య అంతగా ఉండదని అధికారులు భావించారు. కానీ గురువారం మాత్రం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే వసతి గృహాలు దొరకడం కూడా ఆలస్యమవుతుంది. తిరిగి రేపటి నుంచి వరసగా ఆదివారం వరకూ రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భారీ వర్ష సూచన వాతావరణ శాఖ చేసినప్పటికీ ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు తిరుమలకు తరలి వస్తుండటంతో కొండమీద భక్తులతో సందడిగా మారింది. గోవింద నామస్మరణలతో మాడ వీధులు మారుమోగుతున్నాయి. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రానున్న కాలంలో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ...