పంతం నెగ్గించుకున్న బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడు. ఒంగోలు డీఎస్పీగా అశోక్ రెడ్డి బదిలీని అడ్డుకున్నారు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడు. ఒంగోలు డీఎస్పీగా అశోక్ రెడ్డి బదిలీని అడ్డుకున్నారు. ఆయన స్థానంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిని నియమించారు. అశోక్ రెడ్డి ఒంగోలు డీఎస్పీగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిఫార్సుతో వచ్చారని భావించిన బాలినేని శ్రీనివాసరెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు.
వైవీ సిఫార్సుతో...
జగన్ తో సమావేశమైన తర్వాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే డీఎస్పీ నియామకం విషయంలో జగన్ వద్ద బాలినేని అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతోనే అశోక్ రెడ్డిని వెనక్కు రప్పించిన ప్రభుత్వం బాలినేని సూచించిన అధికారినే నియమించడంతో కథ సుఖాంతమైందని చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకాలో కూడా డీఎస్పీని ప్రభుత్వం మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.