పేటలో పోటీపై క్లారిటీ ఇచ్చిన కాసు
నరసరావుపేటలో ఫ్లెక్సీల వివాదంపై మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి స్పందించారు. వివాదాన్ని కొందరు కావాలనే సృష్టించారన్నారు
నరసరావుపేటలో ఫ్లెక్సీల వివాదంపై మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి స్పందించారు. ఫ్లెక్సీల వివాదాన్ని కొందరు కావాలనే సృష్టించారని ఆయన అన్నారు. తాము ఎవరినీ ఫ్లెక్సీలను కట్టమని కోరలేదని అన్నారు. తమ కుటుంబాన్ని అభిమానించే వారు కొందరు ఫ్లెక్సీలు కట్టి ఉంటారని తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలంటూ కాసు మహేష్ రెడ్డి ఫ్యాన్స్ పేరిట నరసరావుపేటలో ఫ్లెక్సీలు వెలిశాయి. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అంటూ అందులో పేర్కొనడం వివాదమయింది.
మళ్లీ అక్కడి నుంచే....
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గీయులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వివాదంగా ముదరుతుండటంతో కాసు కృష్ణారెడ్డి రెస్పాండ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోట ీచేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ఎవరైనా పోటీ చేస్తారని, ఒకరి ఇష్టాలతో పని ఉండదని ఆయన అన్నారు.