టీడీపీ నేత దేవినేని ఉమా అరెస్ట్

అశోక్ బాబును పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీనేత దేవినేని ఉమా ను కూడా అరెస్ట్ చేశారు. అశోక్ బాబును క‌లిసేందుకు పోలీసులు

Update: 2022-02-11 06:03 GMT

బీకాం చదవకపోయినా.. చదివినట్లుగా తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించారన్న ఆరోపణలతో.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును గత అర్థరాత్రి సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట కూడా హాజరు పరిచినట్లు సీఐడీ వెల్లడించింది. తాజాగా ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీనేత దేవినేని ఉమా ను కూడా అరెస్ట్ చేశారు. అశోక్ బాబును క‌లిసేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో వారితో దేవినేని ఉమ గొడ‌వ పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దేవినేని ఉమా అరెస్ట్ అలజడి రేపుతోంది.

ఇదిలా ఉండగా.. ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా.. ఇంకా ప్రజాపాలనపై దృష్టిసారించకుండా కక్షసాధింపులకే పరిమితమయ్యారంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని విమర్శించారు సోమిరెడ్డి.


Tags:    

Similar News