వైఎస్ జగన్ కి ప్రివిలేజ్ నోటీసులివ్వాలి
అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన వైఎస్ జగన్ కు ప్రవిలేజ్ నోటీసులు ఇవ్వాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు
అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన వైఎస్ జగన్ కు ప్రవిలేజ్ నోటీసులు ఇవ్వాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా సభను నిర్వహించండం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులుండరని, చట్ట సభల ప్రతిష్టకు, గౌరవానికి ఈ ప్రభుత్వం మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తుందని యనమల రామకృష్ణుడు అన్నారు. ట్రెజరీ నిబంధనలను పాటించకుండానే 26,839 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. గత ఐదేళ్లలో అతి తక్కువ వృద్ధిరేటు నమోదయిందని కాగ్ స్పష్టం చేసిందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
నైతిక హక్కులేదు...
సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చామని చెప్పుకునే జగన్ కు స్థానికసంస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. పంచాయతీలకు సంబంధించి 854 కోట్ల రూపాయలు ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభతువ్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదని అన్నారు. దీంతో రాష్ట్రంలో రెండు లక్షల మంది గర్భిణులు ప్రధానమంత్రి మాతృవికాస యోజన కింద ఇచ్చే ఐదు వేల రూపాయలను కోల్పోయారన్నారు.