అన్నీ అబద్ధాలే... ఎవరొస్తారు ఇలా ఉంటే?

విభజించి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు

Update: 2023-02-18 08:12 GMT

అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని మాజీ ఎంపీీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వనంటూ కేంద్ర ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాలకు దొడ్డిదారిన నిధులను ఇస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. హోదా ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని అన్న ఆయన ఏ పరిశ్రమ అయినా హైదరాబాద్ కో తమిళనాడుకో, కర్ణాటకకో వెళుతుందన్నారు.

రాయితీలు ఎలా ఇస్తారు?
చివరకు జగన్ కు చెందిన భారతి సిమెంట్స్, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయాలు కూడా ఏపీకి రాలేదన్నారు. హోదా ఇచ్చినట్లయితే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విభజన సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. జీతాలు ఇవ్వడం కూడా కష్టమయిన పరిస్థితుల్లో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా రాయితీలు ఇస్తుందని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ అన్ని అబద్ధాలు చెబుతున్నారని, ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పలేదని అన్నారు. నిన్న చంద్రబాబు సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఉండవల్లి అన్నారు.


Tags:    

Similar News