కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ 31న
కొత్త జిల్లాల ఏర్పాటు పై కసరత్తులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 31వ తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదలకానుంది
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పై కసరత్తులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 31వ తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదలకానుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు, జిల్లా ఏర్పాటు చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మార్పులు, చేర్పులపై కూడా జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
అభ్యంతరాలను....
దాదాపు 9 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. జిల్లా పేర్లు మార్చాలని, తమను పలానా జిల్లాలో చేర్చాలని, జిల్లా కేంద్రాన్ని మార్చాలంటూ అనేక విజ్ఞప్తులు ప్రజల నుంచి అందాయి. వీటన్నింటిలో కొన్నింటిని పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కానుండటంతో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దయెత్తున ప్రజల భాగస్వామ్యంలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.