Pension : తొలి పింఛను అందుకున్న ఫర్వీన్

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్నానికి చెందిన ఫర్వీన్ తొలి పింఛను అందుకున్నారు

Update: 2024-07-01 01:51 GMT

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్నానికి చెందిన ఫర్వీన్ తొలి పింఛను అందుకున్నారు. మచిలీపట్నానికి చెందిన ఫత్తుల్లాబాద్‌ కు చెందిన సీమా ఫర్వీన్ కు ఇరవై ఒక్క ఏళ్లు. దివ్యాంగురాలు కావడంతో పాటు ఆమెకు వంద శాతం అంగవైకల్యం ఉంది. మంచానికే పరిమితమయింది. అయితే చంద్రబాబుఎన్నికల ప్రచారానికి మచిలీపట్నానికి వచ్చినప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫర్వీన్ కు పింఛన్ ను అందచేస్తామని నాడు ప్రకటించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు...
నాడు ఇచ్చిన హామీ మేరకు తొలి పింఛను ను సోమవారం ఫర్వీన్ తొలి పింఛను అందుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫర్వీన్ కు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఫర్వీన్ కు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ను మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు. దీంతో ఫర్వీన్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.


Tags:    

Similar News