YSRCP : బీ ఫారం చేతికి అందేంత వరకూ డౌటే.. అందుకే సంబరపడకండి సారూ

వైసీపీ ఐదో జాబితా రెడీ అయింది. మంత్రి బొత్స సత్యనారా‍యణ ఐదో విడత జాబితాను విడుదల చేశారు

Update: 2024-01-31 15:03 GMT

వైసీపీ ఐదో జాబితా రెడీ అయింది. మంత్రి బొత్స సత్యనారా‍యణ ఐదో విడత జాబితాను విడుదల చేశారు. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. ఇదే ఆఖరి లిస్టు అని పైకి చెబుతున్నా ఎన్నికల వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంటే చివరకు బీ ఫారం ఎవరికి దక్కుతుందో చివరి క్షణం వరకూ ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే ముందుగా జనంలోకి పంపిన ఇన్‌ఛార్జులకు ప్రజల నుంచి తగిన సానుకూలత లభిస్తే వారినే కొనసాగించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. అలా కాకుండా వారిపై జనంలో పెద్దగా సానుకూలత రాకపోతే వారిని చివరి నిమిషంలో కూడా మార్చేందుకు సిద్ధమవుతుంది.

గెలుపే లక్ష్యంగా...
వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగానే తాము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఎవరి సిఫార్సులకు లొంగడం లేదని, అలాగే బంధువర్గం. నమ్మకం వంటి వాటికి కూడా తావు లేదని కూడా ఇప్పటి వరకూ విడుదలయిన జాబితాను చూస్తే అర్థమవుతుంది. జగన్ తో తొలి నుంచి నడుస్తున్న వారిని కూడా పక్కన పెట్టారు. కొందరికి సీట్లు మార్చారు. అలాగని గెలిచే అవకాశాలున్న చోటుకు మాత్రమే వారిని ఛేంజ్ చేశామని అంటున్నారు. మరోవైపు సామాజికవర్గాల వారీగా కూడా అన్ని రకాలుగా చూస్తున్నట్లు తెలిపారు.
వివిధ సంస్థల ద్వారా...
తాము చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. అందుకే తనకు స్టార్ క్యాంపయినర్లు ఈ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన లబ్దిదారులేనని జగన్ అన్నారంటే కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. అందుకే వచ్చే ఎన్నికలు కీలకం కాబట్టి ఎవరినీ స్పేర్ చేయదలచుకోలేదు. కేవలం సర్వే నివేదికలను తెప్పించుకుని మాత్రమే ఛేంజెస్ చేస్తున్నామంటున్నారు. కేవలం ఐప్యాక్ మాత్రమే కాకుండా వివిధ రూపాల్లో కూడా జగన్ సర్వేలు చేయించుకున్న తర్వాతనే అంతిమంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ అగ్రనాయకత్వం చెబుతుంది. ఐదో జాబితాలో కూడా కొందరికి స్థాన చలనం కలిగింది.

ఐదో జాబితా ఇదే....
01. నరసారావు పేట పార్లమెంటు - అనిల్ కుమార్ యాదవ్

02. మచిలీపట్నం పార్లమెంటు - సింహాద్రి రమేష్

03. తిరుపతి పార్లమెంటు - మద్దెల గురుమూర్తి

04. కాకినాడ పార్లమెంటు - చలమలశెట్టి సునీల్

అసెంబ్లీ

05. సత్యవేడు - నూకతోటి రాజేష్

06. అరకు - రేగం మత్స్యలింగం

07. అవనిగడ్డ - సింహాద్రి చంద్రశేఖర్ రావు





Tags:    

Similar News