Nara Lokesh Yuvagalam : పాదయాత్ర @ 3000 కి.మీ
నారా లోకేశ్ పాదయాత్ర ముగింపు వేదిక ఖరారయింది. ఈనెల 20వ తేదీన పాదాయత్ర ముగియనుంది.
నారా లోకేశ్ పాదయాత్ర ముగింపు వేదిక ఖరారయింది. ఈనెల 20వ తేదీన పాదాయత్ర ముగియనుంది. భోగాపురం మండలం పోలిపల్లిలో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. అక్కడ రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదాయత్ర మూడు వేల కిలోమీటర్లకు చేరుకుంది. ఉదయం తేటగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఈరోజుకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 219 కిలోమీటర్లకు చేరుకుంది. మూడు వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా పైలాన్ ను నారా లోకేష్ ఆవిష్కరించనున్నారు.
వరస సమావేశలతో....
తేటగుంట పద్మనాభ ఫంక్షన్ హాలు వద్ద డాక్టర్లతో లోకేష్ సమావేశం కానున్నారు. 11.30 గంటలకు చామవరం గేటు వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. 11.45 గంటలకు ఎస్. అన్నవరం సాయివేదిక వద్ద భోజన విరామం. మధ్యాహ్నం ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గీయులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రి 7.30 గంటలరే సీతారాంపురంలో స్థానికులతో సమావేశం అవుతారు. నామవరం వద్ద రాత్రి బస చేయనున్నారు.