Egg Biryani : విశాఖ రైల్వే స్టేషన్ లో ఎగ్ బిర్యానీ తిని ఐదుగురికి అస్వస్థత
విశాఖ రైల్వే స్టేషన్ లో ఎగ్ బిర్యానీ తిని ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. పాట్నా - ఎర్నాకులం రైలులో ఈ ఘటన జరిగింది.;
విశాఖ రైల్వే స్టేషన్ లో ఎగ్ బిర్యానీ తిని ఐదుగురు స్వస్థతకు గురయ్యారు. పాట్నా - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బిర్యానీ తిన్న తర్వాత అరగంటకు అస్వస్థతకు గురయ్యారు. ఎగ్ బిర్యానీ విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేశారు. ఈ బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రాజమండ్రిలో చికిత్స...
రైల్వే మదత్ యాప్ లో కొందరు దీనిపై రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వీరిని చేర్చి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే వీరందరూ చికిత్స తర్వాత వేరే రైలులో వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. నాసిరకమైన ఆహారాన్ని తిన్నందునే అస్వస్థతకు గురయ్యారని వారు ఆరోపించారు.