గన్నవరంలో ల్యాండ్ కాకుండానే వెనుదిరిగిన విమానం
గన్నవరం విమానాశ్రయంలో ఉదయం పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అవ్వలేదు.;

గన్నవరం విమానాశ్రయంలో ఉదయం పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అవ్వలేదు. దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన విమానం గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయింది. ఇండిగో విమానం గన్నవరంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా దట్టమైన పొగమంచు కారణంగా అరగంట పాటు ల్యాండింగ్ కోసం ప్రయత్నించి సాధ్యం కాక తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయింది.
సేఫ్ ల్యాండింగ్ కోసం...
సేఫ్ ల్యాండింగ్ కు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతోనే విమానం వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయంలో దిగాల్సిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మళ్లీ వాతావరణం అనుకూలించిన తర్వాత ఈ ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయానికి రానుంది.