Srisailam : తగ్గుతున్న వరద.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో ఎంతంటే?
శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుతుంది. పది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుతుంది. శ్రీశైలం జలాశయం పది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,46,410 క్యూసెక్కులుగా ఉందని, ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులు గా ఉందని అధికారులు తెలిపారు.
విద్యుత్తు ఉత్పత్తి...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వరద తగ్గడంతో గేట్లను మూసివేసేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.