కొత్త జిల్లాల తలనొప్పి.. పేర్లు, ఊర్లు మార్చాలంటూ?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిిస్తున్నాయి

Update: 2022-01-27 02:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిిస్తున్నాయి. 26 జిల్లాల ఏర్పాటుపై పెద్దగా ఎక్కడి నుంచి అభ్యంతరాలు లేకపోయినా జిల్లాల ఏర్పాటు, వారి పేర్లపైనే ఎక్కువగా విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా కొందరి పేర్లను, కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలకు కొందరు దిగుతున్నారు. ప్రభుత్వం నెల రోజులు దీనిపై సూచనలు చేసేందుకు, ఫిర్యాదులు స్వీకరించేందుకు సమయం ఇవ్వడంతో పెద్దయెత్తున వినతులను పంపాలని నిర్ణయించారు.

వంగవీటి రంగా....
ముఖ్యంగా విజయవాడ ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టి, విజయవాడ ప్రాంతానికి వంగవీటి రంగా పేరును పెట్టాలని కోరుతున్నారు. వంగవీటి రంగా సోదరుడు కుమారుడు నరేంద్ర ఈ డిమాండ్ చేశారు. తాను ప్రభుత్వానికి గతంలోనే చెప్పానని, అయినా వంగవీటి పేరును పట్టించుకోలేదని ఆయన ఆవేదన చెందారు. మరోవైపు ఎన్టీఆర్ పేరును ఆయన పుట్టిన చోటు కాకుండా విజయవాడ ప్రాంతానికి పెట్టడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మదనపల్లిని....
అలాగే మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ఇప్పటికే కొందరు ఆందోళనకు సిద్ధమయ్యారు. కొందరు రాజకీయ నేతల కుట్రల కారణంగానే జిల్లా కేంద్రం రాయచోటికి వెళ్లిందని, దీనిని మదనపల్లికి మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడకు ఆనుకుని ఉన్న పెనమలూరు వంటి ప్రాంతాలను కృష్ణా జిల్లాలో కలపడం పై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మార్పులు, చేర్పులకు అవకాశముండటంతో కొందరు జిల్లా కేంద్రాలు, పేర్ల మార్పు కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News