Ys Jagan : ఎమ్మెల్యేలతో జగన్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం వైసీపీయేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

Update: 2024-11-11 12:27 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం వైసీపీయేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అయితే తాము ప్రశ్నిస్తామన్న భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దాటవేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయిన జగన్ వారితో శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికలసమయంలో ఇచ్చిన హామీల అమలుకు అధికార పార్టీని నిలదీయాలని శాసనమండలి సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా...
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ తాము కోర్టులో పిటీషన్ వేశామని, అయితే స్పీకర్ దానికి కౌంటర్ ఇవ్వకుండా దాట వేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమేనన్న జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందని దానిని ఇవ్వడం లేదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి హక్కుగా మైకుతో పాటు సమయం లభిస్తుందని అన్న జగన్ గత ఎన్నికల్లో నలభై శాతం ఓట్ షేర్ ను సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించడమేంటని ప్రశ్నించారు. అధికారపార్టీని శాసనమండలిలో నిలదీయాలన్న జగన్ ప్రజాసమస్యలను లేవనెత్తాలని కోరారు.


Tags:    

Similar News