Ap Elections : నాటి కలెక్టర్లు.. నేడు ఎమ్మెల్యేలు

ఒకప్పటి జిల్లా కలెక్టర్లు నేడు ఎమ్మెల్యేలుగా మారారు. కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు

Update: 2024-06-05 07:28 GMT

ఒకప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు నేడు ఎమ్మెల్యేలుగా మారారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు చెందిన ఐఏఎస్ లను అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి తీసుకుని టిక్కెట్లు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అనేక మంది ఐఏఎస్ లు ఎమ్మెల్యేలుగా మారారు. ఈ ఎన్నికల్లోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు పార్టీల నుంచి పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. నిజంగా ఇది కూడా అరుదైన ఘటనగానే చూడాల్సి ఉంది. వేర్వేరు పార్టీలైనా కూటమిలో ఉన్న పార్టీల నుంచి పోటీచేసి వీరిద్దరూ గెలుపొందారు.

రెండు పార్టీల నుంచి...
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన దేవ వరప్రసాద్ గతంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 39,011 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక మరొక మాజీ ఐఏఎస్ బి.రామాంజనేయులు టీడీపీ అభ్యర్థిగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పై 41,151 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇలా ఇద్దరూ గతంలో నిజామాబాద్ జిల్లాకలెక్టర్లుగా పనిచేశారు.


Tags:    

Similar News