యనమల సంచలన వ్యాఖ్యలు..?
సీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. 48 వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దిగమింగారని ఆయన ఆరోపించారు. నిధుల దుర్వినయోగం పై సీబీఐ విచారణ జరపాలని యనమల డిమాండ్ చేశారు. 1.78 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 48 వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఎందుకు లెక్కలు చూపలేకపోతుందని ఆయన ప్రశ్నించారు.
నిధులు పక్కదారి పట్టడంపై....
48 వేల కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆ డబ్బు ప్రజలకోసమే ఖర్చు పెడితే ఎందుకు లెక్కలు చూపలేకపోతుందిన యనమల ప్రశ్నించారు. ఖచ్చితంగా నిధులు పక్కదారి పట్టాయని అర్థమవుతుందని చెప్పారు. నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని యనమల కోరారు. రాష్ట్రంలో ఆర్టికల్ 360ని అమలు పర్చాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.