సస్పెన్షన్ ముగిసినట్లే.. పూర్తి జీతం చెల్లించండి
తన సస్పెన్షన్ కాలం ముగిసిందని, పూర్తి జీతం చెల్లించాలని ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.
తన సస్పెన్షన్ కాలం ముగిసిందని, పూర్తి జీతం చెల్లించాలని ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లకు మించి ఎవరి సస్పెన్షన్ ను అయినా కొనసాగించలేరని చెప్పారు. ఒకవేళ కొనసాగించదలుచుకుంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. సస్పెన్షన్ లో ఉన్నంత కాలం తన జీతాన్ని ఇప్పుడు పూర్తిగా చెల్లించాలని కోరారు.
హోంశాఖ అనుమతి...
తన సస్పెన్షన్ పొడిగింపుపై కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని చెప్పారు. గత నెల 28వ తేదీతో తన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. హోంశాఖ అనుమతి తీసుకోకపోవడం వల్ల తన సస్పెన్షన్ కాలం ఆటోమేటిక్ గా ముగిసినట్లేనని చెప్పారు. సర్వీస్ రూల్స్ ప్రకారం తన పూర్తి జీతాన్ని చెల్లించాలని ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.