Pinnelli : నెల్లూరు జిల్లా జైలుకు పిన్నెల్లి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. ఆయనను నిన్న కోర్టులో హాజరుపర్చగా పథ్నాలుగు రోజులు రిమాండ్ చెప్పారు. దీంతో ఆయనను నరసారావుపేట నుంచి నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ను న్యాయస్థానం రద్దు చేయడంతో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ కార్యాలయంలో ఆయనను దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.
14 రోజుల రిమాండ్...
తర్వాత కోర్టులో హాజరుపర్చగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పథ్నాలుగు రోజులు రిమాండ్ న్యాయమూర్తి చెప్పడంతో నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. గత ఎన్నికల సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు, అక్కడ అడ్డుకున్న ఏజెంట్ పై దాడి చేయడంతో పాటు పలు హత్యా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటిలోనూ నిన్నటి వరకూ మధ్యంతర బెయిల్ పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసారావుపేటలో ఉన్నారు. బెయిల్ రద్దు కావడంతో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.