పార్టీ మార్పుపై బాలినేని స్పందన ఇదే
తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు;
తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాను జనసేనలో టచ్ లో ఉన్నానన్నది వట్టి ప్రచారమేనని అన్నారు. తాను అటువంటి రాజకీయాలు ఎప్పుుడూ చేయనని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తాను కొనసాగితే వైసీపీలోనే ఉంటానని, లేకుంటే మానేస్తానని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తనకు చేనేతకు సంబంధించి ఛాలెంజ్ చేయడంతోనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు.
రెస్పాండ్ అయినంత మాత్రాన....
తెలంగాణ మంత్రి కేటీఆర్ వపన్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే, పవన్ తనకు ఛాలెంజ్ విసిరాడన్నారు. పవన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ కార్యకర్తల కోసం తాను ఎంతవరకైనా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.