ఆళ్లగడ్డలో టెన్షన్ టెన్షన్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొన్నందున ఆమెను అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ఆమె పీఏకి నోటీసులు అంద చేశారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డిపై సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
అఖిలప్రియ హౌస్ అరెస్ట్...
ఆయన టీడీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నంద్యాల అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని భూమా అఖిలప్రియ ప్రకటించారు. దీనికి శిల్పా రవిచంద్రారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు బయటకు వచ్చే అవకాశముందని భావించిన పోలీసులు అఖిలప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలకు వీలులేదని పోలీసులు చెబుతున్నారు.