బాబు ఇంటిపై దాడి కేసు.. విచారణకు హాజరైన జోగి రమేష్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు;

Update: 2024-08-16 07:52 GMT
jogi ramesh, ex minister, attack on chandrababus house, police
  • whatsapp icon

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.ఘటన సమయంలో తాను వాడిన కార్లు, వినియోగించిన ఫోన్లను తీసుకువచ్చారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయిన జోగి రమేష్ తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. న్యాయవాదులతో కలసి వచ్చిన జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు.

పోలీసులకు సహకరిస్తానని...
ఇందులో దాచిపెట్టాల్సిన పనిలేదని తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు సమర్పిస్తానని తెలిపారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. తన కుటుంబంపై కక్ష కట్టి వ్యక్తిగత ద్వేషంతో అక్రమకేసులు బనాయిస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని తెలిపారు.


Tags:    

Similar News