Kodali Nani : ముంబయికి కొడాలి నాని తరలింపు
మాజీ మంత్రి కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబయికి తీసుకెళుతున్నారు;

మాజీ మంత్రి కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబయికి తీసుకెళుతున్నారు. ఆయన ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నా, మెరుగైన వైద్యం కోసం కొడాలి నానిని ముంబయికి తరలించాలని నిర్ణయించారు.
మెరుగైన వైద్యం కోసం...
ప్రత్యేక విమానంలో కొడాలి నానిని తీసుకెళుతున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒకవేళ హార్ట్ సర్జరీ అవసరమయితే ముంబయిలోని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించాలని భావించి కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకుని ప్రత్యేక విమానంలో ఆయనను తీసుకెళుతున్నారు. ఈ మేరకు కొడాలి కుటుంబం ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకుంది.