ఏపీ సీఎం జగన్ కు ముద్రగడ మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. సంక్రాంతి పండగకు కోడిపందేల నిర్వహణకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. ఐదు రోజుల పాటు కోడిపందేల నిర్వహణకు అనుమతివ్వాలని ముద్రగడ పద్మనాభం జగన్ కు రాసిన లేఖలో కోరారు.
అనుమతి ఇప్పించాలని...
కోడిపందేలు జల్లికట్టు వంటి వాటికంటే ప్రమాదకరమైనవి కావని ముద్రగడ లేఖలో గుర్తు చేశారు. ఇవి సంప్రదాయంగా వస్తున్న ఆచారం కావడంతో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరించవద్దని కోరారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, అనుమతివ్వాలని ముద్రగడ లేఖలో జగన్ ను కోరారు.