ముద్రగడకు తీపికబురు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధినేత జగన్ తీపికబురు అందించారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధినేత జగన్ తీపికబురు అందించారు. ఆయన కుమారుడు గిరిబాబుకు నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ముద్రగడ వైసీపీలో గత ఎన్నికలకు ముందు చేరారు. కాపు సామాజికవర్గం నేతగా ఉన్న ముద్రగడ పార్టీ కండువాను కప్పేసుకున్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా...
దీంతో జగన్ ఆయన కుమారుడికి కీలక బాధ్యతలను అప్పగించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా ముద్రగడ గిరిబాబు నియామకం వైసీపీ చేపట్టింది. ప్రత్తిపాడు నియోజవర్గ వైస్సార్సీపీ ఇన్చార్జిగా మాజీమంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం,తనయుడు ముద్రగడ గిరిబాబును నియమించినట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార ప్రకటనలో తెలిపారు.