TDP : కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన సోమిరెడ్డి

అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు

Update: 2024-05-16 07:47 GMT

అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతల విధ్వంసం సృష్టించాన్నారు. నాటి బీహార్ కంటే దారుణంగా ఏపీలో పరిస్థితి తయారయిందన్నారు. అరాచక పాలనను తరిమికొట్టేందుకు కట్టలు తెంచుకున్న ఓటింగ్ శాతం ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. దాడులపై డీజీపీ, చీఫ్ సెక్రటరీలను ఎలక్షన్ కమిషన్ మందలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 135 సీట్లతో టీడీపీదే గెలుపు అని ఆయన అన్నారు. కడప పార్లమెంట్ లో టీడీపీకి మెజార్టీ సీట్లు రాబోతున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలి... లేదంటే జూన్ 4 తరువాత మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ను...
అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రేదేశ్ గా జగన్ మార్చాడన్న సోమిరెడ్డి, చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపేశాడన్నారు. ఐఏఎస్, ఐసీపీఎస్ లను కూలీల కింద మార్చాడని, శాసన సభలో తీసుకున్ననిర్ణయాలను చెత్తబుట్టలో పడేశాడన్నారు. చట్టసభ నిర్ణయాలకు విలువలేదని, వ్వవస్థలకు విలువలేదని, ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు జగన్ రెడ్డి పాలన అని సోమిరెడ్డి అన్నారు నాడు బీహార్ ఎలా ఉందో నేడు ఏపీని అలా తయారు చేశాడన్న సోమిరెడ్డి బయటికి వెళితే ఏపీ అంటే తలదించుకునే పరిస్థితికి జగన్ దిగజార్చాడన్నారు. ఐదేళ్ల అరాచకాన్ని పారదోలేందుకు ప్రజలు కట్టలు తెంచుకును వచ్చి ఓట్లు వేశారన్నారు.


Tags:    

Similar News