ఏలూరులో టెన్షన్.. జోగయ్య దీక్షతో..?
కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ నేటి నుంచి ఆమరణదీక్షకు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సిద్ధమయ్యారు
కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ నేటి నుంచి ఆమరణదీక్షకు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సిద్ధమయ్యారు. దీంతో నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు పట్టణంలో భారీగా పోలీసుల మొహరించారు. కాపు సంక్షేమ సేన కార్యకర్తలు చలో ఏలూరుకు పిలుపునివ్వడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దయెత్తున బలగాలను దించారు. హరిరామ జోగయ్య వయసు మీరడంతో ఆయనను దీక్ష చేయకుండానే పోలీసులు అడ్డుకున్నారు.
ఆసుపత్రిలోనే...
పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలోనే తాను ఈక్షణం నుంచే దీక్ష చేస్తున్నట్లు హరిరామ జోగయ్య ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, అప్పటి వరకూ తన దీక్ష కొనసాగుతుందని హరిరామ జోగయ్య తెలిపారు. కాపు రిజర్వేషన్ల కోసం తాను మరణించడానికైనా సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం ఏలూరులో టెన్షన్ నెలకొంది. బయట వ్యక్తులు ఎవరినీ ఏలూరు పట్టణంలోకి పోలీసులు అనుమతించడం లేదు.