Jayaprada : ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా

ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏర్పాటు చేయగలిగిన వారికే ప్రజలు మద్దతు ఇవ్వాలని సినీనటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు;

Update: 2024-04-03 11:42 GMT
Jayaprada : ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏర్పాటు చేయగలిగిన వారికే ప్రజలు మద్దతు ఇవ్వాలని సినీనటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. ఆమె ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధానమంత్రిగా మూడో సారి నరేంద్ర మోదీ అవ్వాలని శ్రీవారిని ప్రార్థించానని మీడియాకు జయప్రద తెలిపారు. మోదీ విజయంతోనే దేశాభివృద్ధి అని అన్నారు.

వారిద్దరూ అంటే ఇష్టం...
తనకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమన్న జయప్రద చంద్రబాబు అంటే ఎంతో గౌరవం అని అన్నారు. తనను పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎననికల ప్రచారం నిర్వహిస్తానని జయప్రద తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి అన్ని రకాలుగా చెందాలంటే అది కూటమి అధికారంలోకి రావడంతోనే సాధ్యమని జయప్రద అన్నారు.


Tags:    

Similar News