Undavalli : ఎగ్జిట్ పోల్స్ పై పెదవి విరిచిన ఉండవల్లి.. రీజన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్దకాలంగా దయనీయంగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Update: 2024-06-02 12:28 GMT

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్దకాలంగా దయనీయంగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణలో రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని.. ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద గోసగా మారిందన్నారు.

ఎవరు అధికారంలోకి వచ్చినా...
మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని.. అధికారంలోకి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన రూ. 1.42 లక్షల కోట్లలో 58 శాతం తెలంగాణ ఇవ్వలేదని ఉండవల్లి ఆరోపించారు. ఎవరూ అడిగే ధైర్యం చేయలేకపోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారని, నాలుగోతేదీన ఎవరిది అధికారమో తెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే నీటి విడుదల, విభజన సమస్యలలో న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News