కాంగ్రెస్ మ్యానిఫేస్టోలో ఉండే అంశాలివే

ఈ నెల 26వ తేదీ నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు

Update: 2024-02-16 11:35 GMT

ఈ నెల 26వ తేదీ నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఆరోజున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొంటారని, భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు.

భారీ బహిరంగ సభతో...
కాంగ్రెస్ పార్టీ పోలవరం, రాజధాని అమరావతితో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు అనేక కీలకమైన విషయాలతో మ్యానిఫేస్టో రూపొందుతుందని తెలిపారు. మ్యానిఫేస్టోలో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ను ఈసారి ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఆదరిస్తారని ఆయన చెప్పారు.


Tags:    

Similar News