ఏపీలోని ఆ పార్టీలపై కేవీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలపై మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలపై మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అయినా ఒక్క పార్టీ కూడా స్పందించలేదన్నారు. రాహుల్ గాంధీపై అన్యాయంగా అనర్హత వేటు వేసినా ఒక్కరూ నోరు మెదపలేదన్నారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీల గొంతులు మూగబోయాయనని కేవీపీ ఫైర్ అయ్యారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు తమతో...
అధికార పార్టీ వైసీపీకి 30 మంది ఎంపీలున్నా ఏ ఒక్కరూ దీనిపై స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అంశాన్ని సమర్థించడం లేదన్న కేవీపీ చంద్రబాబుకు ఏమయిందని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు, తామూ మిత్రపక్షమేనని, మోదీ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తామని గతంలో చంద్రబాబు అన్న విషయాన్ని కూడా కేవీపీ గుర్తు చేశారు.