దావోస్ లో ఏపీకి ప్రాతినిధ్యం ఎందుకు లేదు?

దావోస్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు ప్రాతినిధ్యం లేదో చెప్పాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు

Update: 2023-01-17 11:44 GMT

దావోస్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు ప్రాతినిధ్యం లేదో చెప్పాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిందన్నారు. జగన్ రెడ్డి జమానాలో ఏపీ జూదాలు, మాదకద్రవ్యాలు, నేరాల కేంద్రంగా మారిందన్నారు. తన ముఖం చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని జగన్ రెడ్డిక అర్థమయిందా? అని బొండా ఉమ ప్రశ్నించారు.

కోడిపందేలు.. జూదాలతో...
పొరుగు రాష్ట్రానికి చెందిన మంత్రి కేటీఆర్ దావోస్ లో పర్యటిస్తూ వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుంటే, ఏపీ మంత్రి కోడిపందేలు, రికార్డింగ్ డ్యాన్స్ లలో మునిగి తేలుతున్నాడని బొండా ఉమ ఎద్దేవా చేశారు. ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముకుంటూ, మాసం కొట్టుకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచనా? అని బొండా ఉమ అన్నారు. జగన్ అవినీతి, దోపిడీ, విధ్వంసాలే రాష్ట్రానికి పారిశ్రామిక రంగానికి శాపాలని బొండా ఉమ అన్నారు.


Tags:    

Similar News