హైకోర్టుకు అశోక్ గజపతి రాజు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. రామతీర్థం ఘటనపై తనపై కేసు నమోదు చేసిన విషయంలో ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. అశోక్ గజపతి రాజు వేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. రామతీర్థం ఆలయానికి తాను ఛైర్మన్ గా ఉన్నానని, తనను పక్కన పెట్టి ప్రభుత్వం పెద్దలు ఆలయ కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమయ్యారన్నారు. అయితే దీనిపై తాను అభ్యంతరం చెప్పిన మాట వాస్తవమేనని, కానీ అధికారుల విధులను తాను అడ్డుకోలేదన్నారు.
తనపైస కక్ష కట్టి....
ప్రభుత్వం తనపై కక్ష కట్టి వరస కేసులు పెడుతుందని అశోక్ గజపతి రాజు తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఆలయాల ఛైర్మన్ గా ఉన్న తనకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం హరించి వేస్తుందని ఆయన తెలిపారు. కాగా ఈరోజు ఉదయం అశోక్ గజపతి రాజు కు నెలిమర్ల పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగే అవకాశముంది.