Janasena : నేడు 11వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ ప్రకటించేస్తారా?
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు జరగనుంది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు జరగనుంది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడులకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇన్పటి వరకూ జనసేన రానున్న ఎన్నికలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరికొందరిని నేడు ప్రకటించే అవకాశముంది.
రెండో జాబితాను...
జనసేన ఆవిర్భవించి నేటికి పదకొండేళ్లు అయింది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2014లో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోట ీచేసిన జనసేన కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది. ఈసారి మరోసారి 2014 కూటమి ఏర్పడింది. ఈసారి రెండు పార్లమెంటు స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఈసారి అత్యధిక స్థానాలను సాధించి ఏపీ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలని పవన్ భావిస్తున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.