Ys Jagan : రేపటి నుంచి షురూ.. జగన్ పర్యటనలకు అంతా సిద్ధం

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు;

Update: 2024-01-26 03:51 GMT
Ys Jagan : రేపటి నుంచి షురూ.. జగన్ పర్యటనలకు అంతా సిద్ధం
  • whatsapp icon

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటనలను జగన్ ప్రారంభించనున్నారు. రేపటి నుంచి ప్రాంతీయ సదస్సులకు ఆయన హాజరవుతారు. క్యాడర్ తో సమావేశాలతో పాటు బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొంటారు. తొలి సారిగా ఆయన విశాఖ జిల్లాలోని భీమిలీలో రేపు పర్యటించనుండటంతో పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమిలీకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పార్టీ క్యాడర్ హాజరు కానుంది.

వరస పర్యటనలతో...
తర్వాత వరస పర్యటనలతో జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటిస్తారు. వచ్చే నెల పదో తేదీ వరకూ ఈ పర్యటనలు వైసీపీ అధినేత చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ క్యాడర్ ను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు సాగనున్నాయి. తాము ఏ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చిందీ కూడా క్యాడర్ కు జగన్ వివరించనున్నారు. పార్టీ గెలుపు కోసం క్యాడర్ తో పాటు నేతలకు కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News