ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు.. కళాకారులకు మరింత ఉపాధి!

ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన వారసత్వ సంపదకు ప్రతీకగా చెప్పవచ్చు. రాష్ట్రం చేనేత, హస్త కళలకు పుట్టినిల్లుగా నిలుస్తూ వాణిజ్య..

Update: 2024-01-30 16:44 GMT

AP GI 

ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన వారసత్వ సంపదకు ప్రతీకగా చెప్పవచ్చు. రాష్ట్రం చేనేత, హస్త కళలకు పుట్టినిల్లుగా నిలుస్తూ వాణిజ్య పరంగా మరింతగా విస్తరించే విధంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా రెట్టింపు అవుతాయి. రాష్ట్రంలో ఎన్నో ఉత్పత్తులు భౌగోళిక సూచికల (Geographical Indication) గుర్తింపు కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఉత్పత్తులలో వాస్తవాలను గుర్తించిన తర్వాత మాత్రమే భౌగోళికంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు ద్వారా ఉత్పత్తుల కొనుగోలుదారులలో అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించవచ్చు. ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ట్రెజర్స్‌ భారతదేశానికి చెందిన 460పైగా ఉత్పత్తులను పరిశీలించి గుర్తింపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ (ODOP)అనే పథకం ఎన్నో చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతనిస్తుంది. ఇలాంటి పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ వాసులు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లకుండా ఉపయోగపడుతుంది.

ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్‌ అధికంగా పెరుగుతుండటంతో ఉపాధి అవకాశాలు మరింతగా పెరగడం వలన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఈ పథకం ద్వారా హస్తకళల ఉత్పతుత్తులను ప్రోత్సహించడం వలన ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా గ్రామస్థాయిలో హస్త కళాకారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు పెరిగేలా ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తుంది.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళిక సూచిక (GI Tag) గుర్తింపు కలిగిన ఉత్పత్తుల జాబితా:

1. ఆంధ్ర ప్రదేశ్ లెదర్ తోలుబొమ్మలు

2. శ్రీకాళహస్తి పెన్ కలంకారి

3. మంగళగిరి చీరలు అండ్‌ ఫ్యాబ్రిక్స్

4. బందర్ లడ్డు

5. బనగానపల్లె మామిడికాయలు

6. ఏటికొప్పాక బొమ్మలు

7. మచిలీపట్నం కలంకారి

8. ఆళ్లగడ్డ రాతి శిల్పం

9. ధర్మవరం చేనేత పట్టు చీరలు, పావడాలు

10. ఉప్పాడ జమ్‌దానీ చీరలు

11. వెంకటగిరి చీరలు

12. కొండపల్లి బొమ్మలు

13. దుర్గి రాతి శిల్పాలు

14. బొబ్బిలి వీణ

15. గుంటూరు సన్న మిర్చి

16. అరకు వ్యాలీ అరబికా కాఫీ

17. తిరుపతి లాడ్డూ

18. ఉదయగిరి ఉడన్‌ కట్లరీ

19. బుడితి బెల్ అండ్‌ బ్రాస్ మెటల్ క్రాఫ్ట్

20. ఆత్రేయపురం పూతరేకులు

Tags:    

Similar News