ఇక పడవలోనే ప్రయాణం

గోదావరి వరద కోనసీమను తాకింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి;

Update: 2022-07-09 08:16 GMT
ఇక పడవలోనే ప్రయాణం
  • whatsapp icon

గోదావరి వరద కోనసీమను తాకింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పి. గన్నవరం మండలం గంటిపెదపూడి లంకలో గోదావరి నదీపాయ తెగింది దీంతో గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెల వారి పాలెం, పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరద నీరు...
దీంతో పడవలపైనే ఈ గ్రామాల ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లనే తమ గ్రామాలకు వరద నీరు చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద మరింత పెరిగితే కోనసీమలోని కనయాకలంక, అయినివిల్లి, ఎదురు బిడియం కాజ్ వేల పైకి వరద నీరు చేరే అవకాశముంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తడంతో వరద లంక గ్రామాలకు చేరే అవకాశముంది.


Tags:    

Similar News