గోదావరి ఉగ్రరూపం.. ఆరు జిల్లాల్లో ఎఫెక్ట్

గోదావరి వరద ఉధృతి తగ్గడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది

Update: 2022-07-15 02:46 GMT

గోదావరి వరద ఉధృతి తగ్గడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రవాహం 23 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని విపత్తుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్ తెలిపారు. అదే జరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో, 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతుంటారు.

పునరావాస కేంద్రాలకు....
కోనసీమ జిల్లాలో 20, తూర్పుగోదావరి లో 8, అల్లూరి సీతారామరాజు జిల్లలో ఐదు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు, కాకినాడ జిల్లాలో నాలుగు మండాలలపై వరద ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.


Tags:    

Similar News