గోదావరి ఉగ్ర రూపం.. అల్లాడుతున్న కోనసీమ

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు

Update: 2022-07-16 02:32 GMT

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 23.20 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 25 లక్షల క్యూసెక్కుల వరకూ ప్రవహించే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లోని 648 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారులు గోదావరి ఉధృతిపై కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కొనసాసాగుతున్న తరలింపు...
కోనసీమ జిల్లాలోని 21, తూర్పుగోదావరిలోని 9, అల్లూరి జిల్లాలో ఐదు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, ఏలూరులో 3, కాకినాడలో రెండు జిల్లాలపై ప్రభావం చూపే అవకాశముందని విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఇప్పటికే పది ఎన్డీఆర్ఎఫ్, పది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆరు జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 62,337 మందిని 220 పునరావాసకేంద్రాలకు తరలించారని, మరికొందరిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News