నేటి నుంచి బెజవాడలో బుక్ ఫెయిర్

పుస్తకప్రియులకు విజయవాడలో గుడ్ న్యూస్. నేటి నుంచి విజయవాడలో 35వ పుస్తకమహోత్సవం ప్రారంభం కానుంది.;

Update: 2025-01-02 02:34 GMT

పుస్తకప్రియులకు విజయవాడలో గుడ్ న్యూస్. నేటి నుంచి విజయవాడలో 35వ పుస్తకమహోత్సవం ప్రారంభం కానుంది. పదకొండు రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుంది. పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించునున్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రారంభించనున్నారని నిర్వాహకులు తెలిపారు.

ప్రచురణలు అక్కడి నుంచే...
విజయవాడ తొలి నుంచి ప్రచురణ సంస్థలకు కేంద్రంగా విలసిల్లింది. అనేక ప్రచురణ సంస్థలు విజయవాడ నుంచే వివిధ రచయితలకు చెందిన పుస్తకాలను ప్రచురించి దేశానికి అందించిన చోట బుక్ ఫెయిర్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అనేకమంది పుస్తకప్రియులకు నేటి నుంచి పదకొండు రోజుల పాటు పండగ అనే చెప్పాలి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News