ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీలోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Update: 2023-08-28 16:45 GMT

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. APPSC Group-1, Group-2 ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 లో 89, గ్రూప్-2 కు సంబంధించి 508 పోస్టులు భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. గ్రూప్-1 కు సంబంధించి హోం శాఖలో అత్యధికంగా 27 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డీఎస్పీకి సంబంధించి 25, డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ జైల్స్-1, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్-1 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 44 ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖలో 8 ఖాళీలు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 1 ఖాళీ ఉంది. ఇంకా గ్రూప్- ఇంకా గ్రూప్-2 ఖాళీల విషయానికి వస్తే అత్యంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 161 ఉన్నాయి. ఇంకా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 150, డిప్యూటీ తహసీల్దార్ 114, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18, సబ్ రిజిస్ట్రార్ 16, మున్సిపల్ కమిషనర్ పోస్టుల విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు APPSC నుంచి త్వరలోనే విడుదల కానున్నాయి. ఏపీలో ఇటీవల గ్రూప్-1 నియమాలను ఏపీపీఎస్సీ విజయవంతంగా ముగించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఏపీ సైతం గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా లెక్కలను తేల్చాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ రోజు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి అనుమతులు మంజూరు చేశారు. వచ్చే నెలలో ఏపీపీఎస్సీ నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

వీటితోపాటు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు(DEO), ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధం అవుతోంది. ఈ ఖాళీలు మొత్తం 1,119 వరకు ఉన్నాయి. ఇంకా 2020 అసిస్టెంట్ ప్రొపెసర్ పోస్టులు, 220 జూనియర్ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇంకా గ్రూప్-2 సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ లోనూ మార్పులు చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News