సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో సచివాలయాల ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నాలుగేళ్ల కిందట సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్‌ (విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌)గా నియామకమైన వారిలో కొందరికి ప్రమోషన్లు దక్కాయి

Update: 2023-08-27 14:08 GMT

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో సచివాలయాల ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నాలుగేళ్ల కిందట సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్‌ (విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌)గా నియామకమైన వారిలో కొందరికి ప్రమోషన్లు దక్కాయి. నెల కిత్రం అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 53 ఖాళీ ఉండగా.. నెల రోజుల క్రితమేఆ పోస్టులన్నింటినీ విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లతో భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది మంది, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకరు, ఉమ్మడి కడప జిల్లాలో ఇద్దరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితమే పదోన్నతులు పొందారు. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లోనూ 35 మందికి పదోన్నతుల ప్రక్రియ నడుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తుండగా.. అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈ 17 కేటగిరి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించిన బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే.. ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు కూడా తుది దశలో ఉన్నాయంటున్నారు.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ లక్ష్మీశ. ఆయా శాఖల ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

నాలుగేళ్ల క్రితం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకం చేపట్టి 34 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఏడాది క్రితం ప్రొబేషన్‌ ఖరారు కూడా పూర్తి చేసుకొని అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలుతో కూడిన వేతనం అందుకుంటున్నారు. వీరిలో ఇంకొందరు మండల స్థాయిలో పని చేసేందుకు పదోన్నతులు కూడా పొందారు. మిగిలిన వారికి పదోన్నతులకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద సచివాలయాల ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది.

Tags:    

Similar News