సీబీఐ హడావిడి ఏంది? : సజ్జల

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు

Update: 2023-04-18 13:01 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు. అర్జంటుగా చంద్రబాబును ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టే ప్రయత్నం ఒక వర్గం మీడియా చేస్తుందన్నారు. కట్టుకధలను అల్లి వాటిని నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎలా హత్య చేశారన్నది దస్తగిరి స్వయంగా చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎల్లో మీడియాకు అంత ఆత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దస్తగిరిని అప్రూవర్ గా ఎందుకు మార్చారో చెప్పాలని కోరారు.

ముగింపు దశకు...
కేసు ముగింపు దశకు వచ్చినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వివేకా హత్యకేసులో సీబీఐ హడావిడి చేస్తుందన్నారు. సీబీఐ వాడుతున్న పదాలు, మాటలు చూస్తే అది టీడీపీ రాజకీయ అజెండాగానే అర్థమవుతుందన్నారు. సీబీఐ ఎలా విచారణ చేస్తున్నారో ముందుగానే పత్రికల్లో ఎలా వస్తుందని సజ్జల ప్రశ్నించారు. వైఎస్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానందరెడ్డిని మాత్రమే అందరూ గౌరవిస్తారని చెప్పారు. హత్యచేసిన నిందితుడు తాను ఎలా హత్య చేశాడో చెప్పినా ఇంకా కేవలం రాజకీయ కుట్రతోనే విచారణ జరుగుతున్నట్లు అనిపిస్తుందన్నారు.
టీడీపీతో కుమ్మక్కై....
సీీబీఐ, టీడీపీ కుమ్మక్కై విచారణ జరుపుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏకపక్షంగా దర్యాప్తు చేస్తుండం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. మిగిలిన కోణాల వైపు చూడక పోవడానికి కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. రామ్ సింగ్ ను మార్చి కొత్త టీం వచ్చిన తర్వాత కొత్త ఆధారాన్ని ఏమైనా సంపాదించారా? అని ప్రశ్నించారు. రాంసింగ్ పూర్తి చేయాలనుకున్న పనిని ఈ కొత్త టీం పూర్తి చేయాలని వచ్చినట్లుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతోనే ఈ హడావిడి ద్వారా ఏదో ఒకటి చేసి మమ అని అనిపించాలనుకుంటున్నారు. ఈ కేసులో తమ బాధంతా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినందుకే. ఈ కేసు ఎలా నిలబడని అన్నారు. నిజాయితీగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బయటపడతారని తెలిపారు. రాజకీయంగా దెబ్బకొట్టాలని ఈరకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.


Tags:    

Similar News