చేయాల్సిందంతా చేశాం.. ఇంక ఏం చేస్తాం?

సమస్యను మరింత జటిలం చేసేలా ఉద్యోగుల పరిస్థితి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Update: 2022-02-03 12:33 GMT

సమస్యను మరింత జటిలం చేసేలా ఉద్యోగుల పరిస్థితి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలను అనేక సార్లు చర్చలకు పిలిచామని చెప్పారు. ఉద్యోగులకు సమస్యను పరిష్కరించుకోవాలని లేదనిపిస్తుంది. రోజు చర్చలకు పిలుస్తున్నా రావడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటుందని అనేకసార్లు తెలియజేశామని చెప్పారు. తమ కుటుంబంలో భాగంగా ఉద్యోగులను భావించామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉన్న పరిస్థితుల్లో చేయగలిగినంత వరకూ చేశామని చెప్పారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా....
ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గుర్తించి వారి సమస్యలను పరిష్కరించిందని చెప్పుకొచ్చారు. ఉద్యోగ వ్యతిరేక చర్యలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ చేపట్టలేదన్నారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ సానుకూల థృక్పథంతోనే ఉన్నారన్నారు. ఇప్పుడన్న పరిస్థితుల్లో ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయడం, మరొకవైపు ఉద్యోగుల జీతభత్యాలను పెంచడం ప్రభుత్వానికి సమస్యగా మారిందన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సంఖ్య పెరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ నిర్ణయం గురించి ఉద్యోగ సంఘాల నేతలకు అన్నీ వివరించామని చెప్పారు.


Tags:    

Similar News