ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?

మార్చి నెలలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది

Update: 2023-01-29 05:09 GMT

మార్చి నెలలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత ఫిబ్రవరిలో జరపాలని భావించినా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తొలుత ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి 22 రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.

మార్చి రెండో వారంలో...
అయితే మార్చి, 3,4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్విస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో సమావేశాలను ప్రారంభించి మూడో వారంలో ముగించాలన్న అభిప్రాయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News