రేపటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జరిపిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నైట్ కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ ఆదేశించారు. నిజానికి సంక్రాంతి పండగకు ముందే కోవిడ్ కేసుల పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూను విధించాలనుకున్నారు. కానీ పండగ సమయం కావడంతో వాయిదా వేశారు.
రాత్రి 11 గంటల నుంచి...
రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. విమానాలు, రైైళ్లు, బస్సు ప్రయాణికులను కర్ఫ్యూ సమయంలో అనుమతిస్తారు. అయితే వారికి టిక్కెట్ ను చూపించాల్సి ఉంటుంది. నైట్ కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.