Andhra Pradesh : గిరిజన గ్రామాలకు గుడ్ న్యూస్ .. ఇక రూపురేఖలే మారిపోతున్నాయ్

గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2024-09-30 05:54 GMT

ఎన్నో ఏళ్లుగా అసౌకర్యాలతో గిరిజన ప్రాంతాలు ఇబ్బందిపడుతున్నాయి. కనీసం రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులను తీసుకు వచ్చేందుకు కూడా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులతో పాటు మంచినీటి సౌకర్యం వంటివి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

25 రకాల పనులు...
గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ పథకాన్ని త్వరలో అమల్లోకి తేనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.. నవంబర్ నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని 18 జిల్లాల పరిధిలోని 878 గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో 25 రకాల అభివృద్ధి పనులు జరుగుతాయి.


Tags:    

Similar News