Cyclone Michoung : 9 జిల్లాలకు హై అలర్ట్
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిచౌంగ్ తుఫాను దూసుకు వస్తుండటం, నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో తీర ప్రాంత జిల్లాలను అలర్ట్ చేసింది. మొత్తం తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
రెడ్ అలర్ట్ ప్రకటించిన....
బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. అలాగే నెల్లూరు, కడప. తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటంచింది.