Amaravathi : రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం

రాజధాని పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది

Update: 2024-06-24 01:49 GMT

రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2014- 2019 మధ్య కాలంలో భూమి కేటాయించిన సంస్థలతో సీఆర్డీఏ సంప్రదింపులు ప్రారంభించింది. ప్రణాళికలు చెప్పాలంటూ సీఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. తమకు కేటాయించిన స్థలాలు చూపించాలని కొన్ని సంస్థలు కోరాయని చెబుతున్నారు. రాజధానిలో స్థలాలు చూశాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థలు చెబుతున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్ర సంస్థలకు, బ్యాంకులకు రాజధాని అమరావతిలో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు...
కాగ్, ఆర్బీఐ, సీబీఐ, ఎఫ్‌సీఐ సంస్థలకు భూ కేటాయింపులు జరిపింది. గత ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడ సంస్థల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కూడా వారి రాకకు అడ్డుపడింది. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సీపీడబ్ల్యూడీ, తపాలాశాఖ, నిప్ట్, ఎన్ఐడీ, టూల్ డిజైన్, నాబార్డ్, ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ సంస్థలకు భూ కేటాయింపులు జరిపారు. అమరావతిలో కార్యాలయం ఏర్పాటుకు ఐవోసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News