Andhra Pradesh : ఆరంభం అదిరిపోయిందిగా... మూడో సంతకమే ఇలా ఉంటే?

ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2024-06-14 02:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జులై నెల నుంచి పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ చంద్రబాబు పింఛను పెంపు ఫైలు పై సంతకం చేశారు. మూడు వేల నుంచి ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పింఛను పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చారు. వృద్ధులతో పాటు వితంతవులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీతకార్మికులు, మత్స్యకారులు, డప్పు కళకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకు జులై నుంచి నాలుగు వేల రూపాయల పింఛను అందివ్వనున్నారు.

ఏప్రిల్ నెల నుంచి...
ఏప్రిల్ నెల నుంచి పెరిగిన మొత్తంతో పింఛను ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అంటే జులై నెల పిఛను మొత్తం ఏడువేల రూపాయలు ఒక్కొక్క పింఛను దారుకు అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 65.39 లక్షల మంది పింఛను దారులకు ప్రస్తుతం దాదాపు 1940 ోట్ల ఖర్చు అవుతుంది. అయితే జులై నెలలో మాత్రం 4,408 కోట్లు అవసరం అవువుతుంది. ఆగస్టు నెల నుంచి నెలకు నాలుగు వేల రూాపాయల చొప్పున అందచేస్తారు కను 1,650 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఏడాదికి...
ఏడాదికి పింఛను మొత్తం 33,099 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయింది. దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచారు. అలాగే దీర్ఘకాలిక రోగాలతో మంచంలో ఉన్న వారికి, వీల్ ఛైర్ లో ఉన్నవారికి పదిహేను వేలు ఇవ్వనున్నారు. కిడ్నీ, తలసీమీయా బాధితులకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే ఫైలుపై సంతకం చేయడంతో ఇక పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పినట్లే.


Tags:    

Similar News